భారీ వర్షాలతో... వేల ఎకరాల్లో పంట మునక - ఏలేరు జలాశయం తాజా వార్తలు
భారీ వర్షాలు కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఏలేరు జలాశయం నుంచి 15 వేల 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం... గొల్లప్రోలు వద్ద ఏలేరు కాలువ గండి పడింది. గొల్లప్రోలు మండలంలో 7 వేల ఎకరాలకు పైగా పంటనీట మునిగింది.
floods-in-east-godavari-yeleru
భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.ఏలేరు జలాశయం నుంచి15వేల500క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు.దీంతో ఏలేరు కాలువ గొల్లప్రోలు వద్ద గండి పడింది.గొల్లప్రోలు మండలంలో7వేలకుపైగా ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.సుబ్బారెడ్డి సాగర్,సుద్దగడ్డ ఇతర చెరువులు నిండిపోయాయి.వరి,పత్తి,ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీట మునిగినపంటలు చూసి రైతులు బోరుమంటున్నారు.