తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో పది రోజుల నుంచి ఆ ప్రాంత ప్రజలు జలదిగ్భంధంలోనే ఉన్నారు. లంక గ్రామాల్లో నివాస గృహాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఉండేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. నాటు పడవలు, మర పడవలు ఆశ్రయించి లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పడవలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవటంతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. పంటలు నీటిలో ఉండి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ కోనసీమలో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది.
పది రోజులుగా జలదిగ్భంధంలోనే లంకగ్రామాలు
ఉభయగోదావరి జిల్లాలను వరద ముంచెత్తింది. పది రోజులుగా లంక గ్రామాల ప్రజలు నీటిలోనే ఉంటున్నారు. మర పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
floods in east godavari dst In the water 2020