ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో తగ్గిన వరద... కొనసాగుతున్న సహాయక చర్యలు - krishna

ఉప్పొంగుతున్న నదులు... ఇక్కట్లలో ప్రజలు

By

Published : Aug 4, 2019, 8:45 AM IST

Updated : Aug 5, 2019, 6:51 AM IST

రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

06:46 August 05

తూ.గో.: గోదావరిలో నెమ్మదిగా  వరద ప్రవాహం తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద మరికాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.6 అడుగులకు  నీటి మట్టం చేరింది. 
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. డెల్టా కాల్వలకు 7800 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా... సముద్రంలోకి 12.66లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

22:53 August 04

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద...

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి 2,21,789 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 861.6 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 100.7 టీఎంసీలుగా నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

22:52 August 04

గోదావరిలో తగ్గిన వరద...

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద కాస్త తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద14.1 అడుగుల నీటిమట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 7,800 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. సముద్రంలోకి 13.36 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

18:16 August 04

గోదావరి వరదల వల్ల 74 వేల మంది ప్రభావితం...

గోదావరి వరదల వల్ల 74 వేల మంది ప్రభావితమయ్యారు. 17,632 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 6 మండలాల్లో వరద ప్రభావం ఉంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 14.2 అడుగులకు చేరింది. 13.5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పంటకాల్వలకు 7,800 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

వరదబాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిత్యావసరాలు సరఫరా చేసింది. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయకచర్యలు అందిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాల్లోని 280 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. గోదావరి తీరంలోని దేవాలయాలు మూసివేశారు.

16:55 August 04

భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం

పోలవరం ఎగువన గోదావరిలో క్రమంగా నీటిమట్టం తగ్గుతుంది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది. ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.

16:42 August 04

రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో... రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 36గ్రామాలకు పైగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం దిగువన ఎలమంచిలి, ఆచంట మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు భారీగా చేరుతుంది. ఈ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

16:12 August 04

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద 14.2 అడుగులకు చేరిన వరదనీరు

గోదావరి నది ఉద్ధృత ప్రవాహం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరదనీరు 14.2 అడుగులకు చేరింది. 13.45 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

15:13 August 04

శ్రీశైలం జలాశయానికి 2.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు

శ్రీశైలం జలాశయానికి  వరద స్థిరంగా కొనసాగుతోంది.  2.2 లక్షల క్యూసెక్కులు వరద నీరు జలాశయానికి చేరుకుంది.  శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు...  ప్రస్తుత నీటిమట్టం 860.9 అడుగులు. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు... ప్రస్తుత నీటినిల్వ 94.45 టీఎంసీలు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2400 క్యూసెక్కులు విడుదల చేశారు.


 

15:03 August 04

వరద గురించి కంగారు పడొద్దు - మంత్రి పిల్లి సుభాష్​

గోదావరి జిల్లాల ప్రజలకు ఆందోళన పడవద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్‌ అన్నారు.  ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో 5 వేల మందికి వరద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8 వేల మందికి వరద సహాయకేంద్రాలు ఏర్పాటు చేశానట్లు మంత్రి తెలిపారు. 

14:59 August 04

నిలకడగా వరద నీటి మట్టం

గోదావరి నది వరద మట్టం నిలకడగా ఉంది.  ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరదనీరు 14.2 అడుగులకు చేరుకుంది. 13.45 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

14:28 August 04

జనసైనికులు వరద బాధితులను ఆదుకోవాలి

జనసైనికులంతా వరద బాధితులకు సహాయం చేయాలని పవన్​ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

14:22 August 04

వరదలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చర్చ జరిపి... గోదావరి వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై అధికారులతో సమాలోచనలు చేశారు. 
వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. వరద ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసరాలు సరిగా అందేలా చూడాలని ఆదేశించారు.  వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 

13:03 August 04

శ్రీశైలంలో స్థిరంగా వరద

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.2,20,275 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటి మట్టం 853.20 అడుగులుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

12:04 August 04

వర్షాలకు పాఠశాలలు జాగ్రత్త - విద్యాశాఖ మంత్రి

వర్షాల దృష్ట్యా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి సూచించారు.  బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీలను అప్రమత్తం చేయాలన్నారు.
 

10:47 August 04

నిండు కుండలా జలాశయాలు

  •  శ్రీశైలం జలాశయంలో స్థిరంగా కొనసాగుతున్న వరద
  • శ్రీశైలం జలాశయంలో చేరుతున్న 2,19,770 క్యూసెక్కులు
  • శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
  • శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 854 అడుగులు
  • శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు
  • శ్రీశైలంలో ప్రస్తుత నీటి నిల్వ 89.29 టీఎంసీలు
  •  కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2400 క్యూసెక్కులు విడుదల
  •  తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు
  •  తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు
  •  తుంగభద్ర ప్రస్తుత నీటి మట్టం 1608.28 అడుగులు
  • తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు
  • తుంగభద్ర ప్రస్తుత నీటి నిల్వ 33.50 టీఎంసీలు
  • తుంగభద్రకు ఇన్ ఫ్లో- 17,817 ఔట్ ఫ్లో- 1289 క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు
  •  నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి మట్టం 506.80 అడుగులు
  •  నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు
  • నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 126.30 టీఎంసీలు
     
  • ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులు
  • ఆల్మట్టి ప్రస్తుత నీటి మట్టం 1699.97 అడుగులు
  •  ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు
  •  ఆల్మట్టిలో ప్రస్తుత నీటి నిల్వ 103.87 టీఎంసీలు
  • ఆల్మట్టికి ఇన్ ఫ్లో- 2,22,543, ఔట్ ఫ్లో- 2,49,823 క్యూసెక్కులు
  • నారాయణపూర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు
  •  నారాయణపూర్ ప్రస్తుత నీటి మట్టం 1608.79 అడుగులు
  •  నారాయణపూర్ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు
  •  నారాయణపూర్ జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 29.48 టీఎంసీలు
  • నారాయణపూర్ కు ఇన్ ఫ్లో- 2,26,511, ఔట్ ఫ్లో- 2,46,067 క్యూసెక్కులు
  • జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు
  • జూరాల ప్రస్తుత నీటి మట్టం 1044.29 అడుగులు
  •  జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు
  •  జూరాల ప్రస్తుత నీటి నిల్వ 9.21 టీఎంసీలు
  • జూరాలకు ఇన్ ఫ్లో 2,26,000, ఔట్ ఫ్లో 2,21,441

10:25 August 04

ఉగ్ర రూపం దాలుస్తున్న గోదావరి

గోదావరికి వరద నీటి ఉద్ధృతి పెరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. ఇన్​ ప్లో, ఔట్​ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులుందని తెలిపింది.
వరదల దృష్ట్యా అధికారులను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేస్తుంది. వరద ముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేపుడు సహాయక బృందాలకు సహకరించాలని విపత్తుల శాఖ కమీషనర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

 

09:58 August 04

మరో అల్పపీడనం...!

రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 
    శబరి, గోదావరి, ఇంద్రావతి తదితర నదీ బేసిన్లలో భారీ వర్ష సూచనలున్నట్లు వివరించింది. 
భారీ వర్ష సూచన కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 
పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములతో జల్లులు పడే సూచనలున్నట్లు వెల్లడించింది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు  జిల్లాల్లో  ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నట్లు వెల్లడి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం

 

09:40 August 04

నీట మునిగిన గోష్పాద క్షేత్రం

కొవ్వూరులో  వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. గోష్పాద క్షేత్రంలోని దేవాలయాల మొత్తం నీట మునిగాయి. దీనితో అన్ని దేవాలయాలకు తాళం వేస్తున్నారు.   వరద ఉద్ధృతి మరింత పెరగనున్నట్లు అధికారుల వెల్లడించారు. లోతట్టు ప్రాంతంమైన మద్దూరు లంకలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

09:23 August 04

ఉగ్రరూపం దాల్చిన గోదావరి పాయలు

కోనసీమలోని వరద నీటితో   గోదావరి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గౌతమి, వశిష్ట, వైనతీయ పాయలు
ఉగ్రరూపం దాల్చాయి. 

కోనసీమలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో వరద నీరు  పంట పొలాల్లోకి చేరింది.  
అయినవిల్లి, పి.గన్నవరం, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో  పొలాల్లోకి వరద నీరు చేరింది. 
అరటి, మునగ, కూరగాయలు, పచ్చిమిర్చి, కంద తోటలు నీటమునిగాయి. పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
వరదలకు గోదావరి చెంతనే ఉన్న లంక భూములు  కోతకు గురవుతున్నాయి.  కపిలేశ్వరపురం, కేదర్లంక, కొత్తపేట, నారాయణలంక, బడుగువాణి లంక, ఆత్రేయపురం, అయినవిల్లిలో భూములు  కోతకు గురవుతున్నాయి.  

09:17 August 04

పోలవరం వద్ద నిలకడగా వరద

పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం  నిలకడగా ఉంది . స్పిల్ వేపై రెండు మీటర్లకుపైగా వరద నీరు వెళ్తుంది. 

09:07 August 04

పశ్చిమకు పోటెత్తిన వరద

పశ్చిమ గోదావరిలో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. పోలవరం, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి . పోలవరం మండలంలో  19 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వేలేరుపాడు మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.  
 

08:56 August 04

స్థిరంగా శ్రీ శైలం వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 2,16,672 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటి మట్టం 853.20 అడుగులుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

08:40 August 04

ఐదో రోజు జలదిగ్బంధంలో దేవీపట్నం మండలం

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వరద ఉద్ధృతికి 32 గ్రామాలు నీట మునిగాయి.  
గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి . దేవీపట్నం మండలంలో ఐదోరోజు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం ఇబ్బంది  వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ గండి పోచమ్మ ఆలయం నీట మునిగింది. 


వరద ప్రభావిత ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే సహాయ చర్యలు అందుతున్నాయి. విష సర్పాలు ఇళ్లలోకి చేరడంతో భయాందోళనలో మన్యం వాసులు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టాలని జనం వేడుకుంటున్నారు.  పునరావాస కేంద్రాలకు తరలిరావాలని బాధితులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


 

08:31 August 04

భధ్రాచలం వద్ద శాంతించిన వరద

భద్రాచలం వద్ద వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. 45.5 అడుగులకు నీటిమట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక  కొనసాగుతోంది. 

08:10 August 04

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట  వద్ద వరద ఉద్ధృతి  మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.ఉదయం4గంటల నుంచి నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజి వద్ద 13.9 అడుగుల నీటి మట్టం ఉంది. డెల్టా కాల్వలకు 7300 క్యూసెక్కులు... సముద్రంలోకి  13.10లక్షల క్యూసెక్కులు నీరు విడుదల చేశారు.


 

Last Updated : Aug 5, 2019, 6:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details