నీట మునిగిన 20 లంక గ్రామాలు..! తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలుమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని పలుగ్రామాల్లో వ్యవసాయ భూములు వరదనీరుతో నిండాయి. లంక గ్రామాల పరిస్థితి దయనీయంగా తయారైంది. సుమారు 20 ఊళ్లను వరద ముంచెత్తింది. ప్రజలంతా నివాసాలు వదిలి..భారమైన మనసుతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.