రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 17.50 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 18.93 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.
ఉగ్రరూపం దాల్చిన గోదావరి... లంక గ్రామాలు జల దిగ్బంధం
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక స్థాయికి ప్రవాహం చేరుకుంది. లంక గ్రామాలు పూర్తిగా బలదిగ్బంధమయ్యాయి.
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతితో....లంక గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. ఎడతెరిపి లేని వానలతో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద దాటికి చేతికందిన పంటలు కళ్లేదుటే నీటమునుగుతుంటే రైతులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది...