తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.5 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 34వేల క్యూసెక్కులకు పైగా నీరు బ్యారేజీకి చేరింది. డెల్టా ప్రధాన కాల్వలకు 7,300 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మిగతా నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
ధవళేశ్వరం వద్ద 10.5 అడుగులకు చేరిన నీటిమట్టం - ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 10.5 అడుగులకు చేరిన నీరు
తూర్పుగోదావరిలో జోరువానలు కురుస్తున్నాయి. వర్షాలకు గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 10.5 అడుగులకు నీటిమట్టం చేరింది.
![ధవళేశ్వరం వద్ద 10.5 అడుగులకు చేరిన నీటిమట్టం ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 10.5 అడుగులకు చేరిన నీటిమట్టం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7914245-1007-7914245-1594028602243.jpg)
ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 10.5 అడుగులకు చేరిన నీటిమట్టం