ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు దిగువనున్న సముద్రంలోకి నీటిని విడిచి పెడుతున్నారు. ఈ నెల 12న ఉదయం నీటిని దిగుకు వదిలిన అధికారులు తాజాగా గురువారం ఉదయం భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారంతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపయ్యింది. కోనసీమలోని గోదావరి నది పాయలైన గౌతమి, వశిష్టస వైనతేయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పి గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్‌ల మధ్య వైనతేయ, గోదావరిలో ప్రవాహం జలకళను సంతరించుకుని కనువిందు చేస్తోంది.
కోనసీమలో జలకళ... గోదావరి నది పాయల్లో ప్రవహిస్తున్న వరద నీరు - godavari water flow from dhavaleswaram barrage
కోనసీమలో గోదావరి నది పాయల్లో వరద నీరు నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు వల్ల ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అధికారులు దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.
ఫూటుగా ప్రవహిస్తున్న వరదనీరు