ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో దారుణం... నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం - కాకినాడలో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అమానుష ఘటన జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను అపహరించిన దుండగుడు లైంగికదాడికి పాల్పడి ముళ్లపొదల్లో పడేశాడు. కామాంధుడి కర్కశత్వంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి... ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

five years girl was raped in kakinada at east godavari district
నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డ ఆగంతకుడు

By

Published : Nov 25, 2020, 10:53 PM IST

Updated : Nov 27, 2020, 4:18 AM IST

ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తుతెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున కాకినాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..బాలిక తండ్రి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలిక తల్లి కుటుంబపోషణ నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు వారి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమార్తె అయిన ఐదేళ్ల బాలికను అర్ధరాత్రి సమయంలో ఓ కామాంధుడు ఎత్తుకెళ్లాడు. గోళీలపేట శివారు శ్మశానవాటిక వద్దగల తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి కుటుంబసభ్యులకు అప్పగించాడు. చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

బాలికను పరామర్శించిన జిల్లా ఎస్పీ
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి, మరో అధికారి వెంకట్‌, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Last Updated : Nov 27, 2020, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details