ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థ.. రూ.5కే భోజనం - యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ వార్తలు

ముద్ద అన్నం కోసం రోడ్ల మీద ఎదురుచూస్తున్నవారెందరో ఉన్నారు... చిన్ని బొజ్జ కోసం కష్టపడుతున్న వారికి కాసింత భోజనం పెడితే బాగుంటుంది కదా... అలాంటి వారి కోసమే యానాంలో ఓ స్వచ్ఛందసంస్థ ముందుకొచ్చింది. రూ. 5కే భోజనం అందిస్తోంది.

five rupees meals at yanam
ఐదు రూపాయలకే కడుపు నిండుగా భోజనం

By

Published : Dec 14, 2019, 5:32 PM IST

ఐదు రూపాయలకే కడుపు నిండుగా భోజనం

యానాంకు నలుమూలల నుండి వచ్చే ప్రయాణికులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే రోజువారి కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీకి చెందిన ఐఎఫ్​సీఐ సహకారంతో ఒక వాహనంలో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి ప్రధాన కూడళ్లలో భోజనం అందిస్తోంది. అన్నం, రెండు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో కలిపి రూ.5కే అందజేస్తోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్దేశించిన ప్రాంతాలలో సుమారు 1000మందికి కడుపు నిండా భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఈ ఆహారం ఇంటి భోజనాన్ని తలపించేలా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఇదే భోజనం బయట హోటల్లో తినాలంటే రూ.100 అవుతుందని.. కూలీ డబ్బు కూడా ఆదా అవుతుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details