ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘పంచ’ప్రాణాల ప్రమాదకర పయనం!

ముందో మహిళ.. ఆమె చేతుల్లో నిద్రపోతున్నచిన్నారి జారిపోతూ కనిపిస్తోంది. వెనకాల మరో ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టుకుని మరీ ప్రమాదకరంగా వాహనం నడుపుతున్నాడో వ్యక్తి. ఇది చూసిన ప్రతీఒక్కరికీ పాప ఎక్కడ పడిపోతుందోననే భయం. అయినా వాహనదారుడు అదేం పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు.

Five people on a two-wheeler in a dangerous situation
‘పంచ’ప్రాణాల ప్రమాదకర పయనం!

By

Published : Oct 6, 2021, 12:21 PM IST

పిల్లలంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. అలాంటిది ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా ముగ్గురు పిల్లలను, మరో మహిళను కూర్చోబెట్టుకొని ప్రయాణిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్‌ రోడ్డులో కనిపించారు. అసలే చిన్న బండి.. దానిపై ఇద్దరు కూర్చుంటేనే ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంది.

అలాంటి దానిపై వెనుక ఇద్దరు పిల్లలు, ముందు ఓ మహిళ కూర్చున్నారు. సదరు మహిళ ఇబ్బందికరంగానే కూర్చొని చేతిలో మరో బాబును వేలాడేలా పట్టుకున్నారు. ఎంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాడో తెలుసుకోలేని ఆ బుడతడు నిద్రలోకి జారుకున్నాడు. పొరపాటున పట్టుతప్పినా, ద్విచక్రవాహనం బ్యాలెన్స్‌ తప్పినా ‘పంచ’ప్రాణాలకు ప్రమాదమే.

ఇదీ చూడండి:తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

ABOUT THE AUTHOR

...view details