ఐదు నెలల పసిపాప కనిపించటం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పలువురు రావులపాడులోని కాలువగట్టుపై గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వీరు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో మోతి బాలకృష్ణ, మౌలాల్లమ్మ దంపతుల ఐదు నెలల పాప కనిపించకుండా పోయింది. నిన్న రాత్రి తల్లి చెంత నిద్రిస్తున్న పాప గురువారం ఉదయం చూసేసరికి లేదు. చుట్టుపక్కల వెతకగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తల్లి మౌలాలమ్మ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు నెలల పాప అదృశ్యం...కేసు నమోదు చేసిన పోలీసులు - రావులపాలెంలో అయిదు నెలల పాప అదృశ్యం కేసు
అయిదు నెలల పసిపాప కనిపించటం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి తల్లి చెంత నిద్రిస్తున్న పాప గురువారం ఉదయం చూసేసరికి లేదని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
అయిదు నెలల పాప అదృశ్యం...కేసు నమోదు చేసిన పోలీసులు