ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తేటగుంట జాతీయ రహదారిపై ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్న కార్మికుల ఆటోను వ్యాన్​ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

five injured in road accident occured at tetagunta in east godavari
తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

By

Published : Jan 22, 2021, 5:20 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో.. ఐదుగురు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భవన స్లాబ్ నిర్మాణ పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు ఆటోలో వెళ్తుండగా వ్యాన్ ఢీ కొట్టటంతో ఆటో బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఐదుగురిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details