తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కొవిడ్ సోకినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికీ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు ఆ వీధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.
అమలాపురంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు - తాజాగా ఐదు కరోనా కేసులు నమోదైనట్లు అమలాపురం మున్సిపల్ కమిషనర్ ప్రకటన
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో ఇద్దరికి కరోనా సోకడం అధికారులను కలవరపెడుతోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొత్తగా ఐదుగురు కొవిడ్ బారిన పడినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు ప్రకటించారు.
![అమలాపురంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు five corona cases identified in amalapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10983110-1062-10983110-1615557069091.jpg)
అమలాపురంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు