ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముడి చమురు చోరీకి యత్నించిన ఐదుగురి అరెస్ట్ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ముడి చమురు చోరీకి యత్నించిన ఐదురుగు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయారని డీఎస్పీ వై. మాధవరెడ్డి తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

By

Published : Apr 22, 2021, 4:55 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాపతిప్ప గ్రామంలో ఓఎన్జీసీ చమురు బావి నుంచి ముడి చమురు చోరీకి యత్నించిన ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను అమలాపురంలో డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. మెుత్తం ఏడుగురు చోరీకి యత్నించారని.. ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా వాకలగరువు, కొంకాపల్లి, ఓడలరేవు, పాసర్లపూడి లంక, పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామాలకు చెందినవారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details