తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్ తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 420 కోట్ల రూపాయలు మంజూరైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. గతేడాది డిసెంబర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏజెన్సీ ముందుకు వచ్చినా క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఇబ్బందిగా మారాయి.
ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అనువుగా తీరానికి సమాంతరంగా తాత్కాలిక రహదారి నిర్మించారు. ఆయా ప్రాంతం చదును చేశారు. కెరటాల ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడానికి సిమెంట్ బ్లాకులు, ఇతర నిర్మాణ పనులకు యంత్రాలు సిద్ధం చేశారు. కాంక్రీటు మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
సర్వే నెంబర్ 82లో 25 ఎకరాల భూమిని ఏపీ మారిటైమ్ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. అయితే హార్బర్ నిర్మాణానికి నిర్దేశించిన స్కెచ్‌లో ప్రభుత్వం ఇచ్చిన భూమి కేవలం 13 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో మరో 20 ఎకరాల భూమి కేటాయించాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఈ భూమి కేటాయిస్తే గాని పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అమీనాబాద్ తీరంలో హార్బర్ నిర్మాణానికి అనువుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలి. పడవలు నిలిపేందుకు వీలుగా జట్టీలు, రక్షణ గోడ, వేలం గదులు, వలలు అల్లుకోడానికి షెడ్లు ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఉప్పుటేరులో నిలిపే బొట్లకు ఇక్కడ వసతి సమకూరుతుంది. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే లక్ష పదివేల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరణకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై మత్యకార కుటుంబాలు ఆశలు పెట్టుకున్నాయి.
Fishing Harbour: ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ పనులు.. అడ్డంకిగా సాంకేతిక సమస్యలు - మత్స్యకారుల
తూర్పు తీర ప్రాంత మత్స్యకారుల చిరకాల వాంఛకు ప్రభుత్వ ప్రకటనతో ఊపిరొచ్చింది. కోట్లరూపాయల నిధులు మంజూరుతో చేపల రేవు ప్రాజెక్టు ఆశలు సజీవం అయ్యాయి. కానీ కొవిడ్ ప్రభావంతో కొంతకాలం కదలిక లేకపోగా.. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ప్రస్తుతం పనులకు అడ్డంకిగా మారాయి. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం రెండేళ్లు గడువు నిర్దేశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ప్రాజెక్టు పూర్తికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది.
Fishing Harbour
ఇదీ చదవండి: