ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2021, 8:22 PM IST

ETV Bharat / state

కాలుష్య భూతం.. రాఘవమ్మ చెరువులో చేపలు మృత్యువాత

రాయభూపాలపట్నంలోని రాఘవమ్మ చెరువులో.. వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. చేపలన్నీ మృతిచెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనకు ఫ్యాక్టరీల నుంచి విడుదలైన వ్యర్థాలే కారణమని స్థానికులంటున్నారు.

fishes dead
రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి

రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చూట్టూ విస్తరించిన ఫ్యాక్టరీల వ్యర్థాల వల్లే ఈ విధంగా జరిగిందని స్థానికులంటున్నారు.

మరోవైపు కొంతమంది ఈ చెరువులో పట్టిన చేపలనే అమ్ముతున్నారని.. మత్స్యశాఖ అధికారులు వీటిపై పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. చనిపోయిన చేపల నుంచి వస్తున్న దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details