తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద.. నదిలో దూకి ఓ వ్యక్తి రెండుసార్లు ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు. లంకల గన్నవరం గ్రామానికి చెందిన చిన్న (25).. పి.గన్నవరం పాత అక్విడెక్ట్ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి వైనతేయ నదిలోకి దూకేశాడు. సమీపంలో ఉన్న మత్స్యకారులు.. బోటులో వెళ్లి యువకుడిని రక్షించారు. గట్టుపైకి తీసుకెళ్లిన తర్వాత.. మరోసారి ఆ యువకుడు నదిలో దూకేశాడు. ఈ సారీ వెంటనే స్పందించిన మత్యకారులు.. అతడిని ఆసుపత్రికి తరలించారు.
రెండు సార్లు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మత్స్యకారులు - రెండు సార్లు ఆత్మహత్యాయత్నం
నదిలో దూకి రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని మత్స్యకారులు రక్షించారు.
Fishermen rescued a young boy who committed suicide in Godavari in east godavari district