ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షేమంగా ఇంటికి చేరుకున్న మత్స్యకారులు

ఐదు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు శనివారం సాయంత్రానికి క్షేమంగా తూర్పుగోదావరి జిల్లాలోని వారి స్వగ్రామానికి చేరుకున్నారు. వారు ఇంటికి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Fishermen  reached  home at  east godavari district
క్షేమంగా ఇంటికి చేరుకున్న మత్స్యకారులు

By

Published : Aug 15, 2020, 11:35 PM IST

ఐదు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు శనివారం సాయంత్రానికి క్షేమంగా స్వగ్రామానికి చేరారు. ఈనెల పొద్దున ఉప్పాడ కు చెందిన వీరన్న, సజీవ్, దుర్గాప్రసాద్, కాశయ్య... ఉప్పాడ చేపల రేవు నుంచి వేటకు బయలు దేరారు. సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన అనంతరం బోటు ఇంజిన్ పాడవ్వడంతో.. వారు వైజాగ్ వెళ్లి బోటు బాగు చేయించుకున్నారు.

ఈ సమాచారం తెలియక ఇతర మత్స్యకారులు, అధికారులు మూడు రోజుల వీరికోసం సముద్ర ప్రాంతంలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం సమీపంలో తాము క్షేమంగానే ఉన్నామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి శనివారం సాయంత్రానికి స్వగ్రామానికి చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details