ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రస్థాయి పదవి ఉన్నా.. నిలువ నీడ లేదు..! - YCP Leader Maremma Latest news

ఆమె మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. స్వయంకృషితో ఎదిగి.. ప్రస్తుతం రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్​ స్థాయిలో ఉంది. మాజీ ఎంపీటీసీ కూడా. కానీ ఏం లాభం? ఆమెకు కష్టం వచ్చినా స్పందించే నాయకుడు లేడు. నష్టం వచ్చినా ఆదుకునేందుకు అధికారలు ఆమెను కలవరు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన తోటకూర మారమ్మ బాధ ఇది.

Fisheries corporation director in bus shelter
తోటకూర మారమ్మ

By

Published : Nov 28, 2020, 3:54 PM IST

తోటకూర మారమ్మ

తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన తోటకూర మారమ్మ.. ప్రస్తుతం రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పదవి ఉన్నా ఆమెకు నిలువ నీడ లేదు. ఉప్పాడలోని తనకున్న ఒకే ఒక ఇల్లు.. నివర్ తుపాను కారణంగా కోతకు గురై సముద్రగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉండాలో కూడా తెలియని దుస్థితి. కూలిపోయిన ఇంట్లో సామగ్రిని తీసుకొని పక్కింట్లో ఆశ్రయం పొందుతోంది.

ఇల్లు సముద్రంలో కలిసి.. వారం రోజులు అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని మారమ్మ వాపోతోంది. ఎంతమంది నాయకులు ఉన్నా.. తనను ఎవరూ పరామర్శించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా పదవులు చేపట్టినా ఒక్క రూపాయి సంపాదించుకోలేదని.. ఎంతోమంది తమ పార్టీలోకి రావాలని అనేక విధాలుగా ఆశ చూపి పిలిచినా జగన్​నే తన కుమారుడిగా భావిస్తూ... వైకాపాలోనే కొనసాగుతున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం బస్ షెల్టర్లలో తలదాచుకుంటున్నట్టు చెప్పి.. కన్నీటి పర్యంతమైంది. ముఖ్యమంత్రి జగన్ తనను ఆదుకోవాలని కోరుతోంది.

ABOUT THE AUTHOR

...view details