ఈ నెల ఒకటో తేదీ నుంచి సముద్ర జలాలు, గోదావరిలో మత్స్య సంపద వేటాడేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చినా మత్స్యకారులు వేటకు వెళ్లలేకపోయారు. ఈనెల తొమ్మిది వరకు మంచి రోజులు కావని, తమ ఇష్టదైవానికి పూజలు చేయకుండా వేటకు వెళ్లకూడదని మానేశారు. పదో తేదీ నుంచి వేటకి సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో ఒక్క బోటు కూడా ఒడ్డు నుంచి కదల్లేదు. కరోనా కారణంగా రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితమైన వీరంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి ఒడ్డునే ఉంటూ గాలి అలల తాకిడికి నావలు కొట్టుకుపోకుండా కాపలా కాసుకుంటున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తిస్థాయిలో అందరికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో ఒడ్డునే నావలు - east godavari district today news update
ప్రభుత్వం కరుణించినా ప్రకృతి కరుణించక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని పది వేల కుటుంబాలు చేపల వేటనే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. వేట నిషేధ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజుల తగ్గించినప్పటికీ తుపాన్ ప్రభావంతో నావలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి.
తుఫాన్ ప్రభావంతో ఒడ్డుకే పరిమితమైన నావలు
TAGGED:
చేపల వేట తాజా వార్తలు