కరోనా నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో మాంసం, చేపల విక్రయాలు నిషేధించారు. దీంతో కుంభాభిషేకం రేవు వద్ద ఏర్పాటు చేసిన చేపల విక్రయ కేంద్రాలకు ఆదివారం కొనుగోలుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకేచోటకు చేరుకోవటం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత దూరం పాటించటం ద్వారానే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు. ఇకనైనా ప్రజలు లాక్డౌన్ నిబంధనలు కచ్ఛితంగా పాటించాలని సూచిస్తున్నారు.
మీనం వేట సరే...దూరం మరిస్తే ఎలా..? - lock down in east godawari
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినా ప్రజలకు పట్టడం లేదు. భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నా..పెడచెవినా పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కుంభాభిషేకం రేవు వద్ద ఏర్పాటు చేసిన చేపల విక్రయ కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి చేపలు కొనుగోలు చేస్తున్నారు.
మీనం వేట సరే...దూరం మరిస్తే ఎలా..?