గొల్లపుంత మెయిన్ రహదారికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి - mandapeta new road first stone by minister news
తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంత మెయిన్ రహదారికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని కోటీ 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండపేటలో ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.