ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా మెుదటి విడత కరోనా టీకా - ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టీకా పంపిణీ

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల మెుదటి విడతగా వైద్యుల పర్యవేక్షణలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ.. కేెంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ సాగింది. అనేకచోట్ల ప్రజా ప్రతినిధులు హాజరై ప్రాథమిక ఆరోగ్య కేెంద్రాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

corona vaccination in east godavari district
తూర్పు గోదావరి జిల్లాలో వ్యాక్సినేషన్

By

Published : Jan 16, 2021, 4:52 PM IST

అమలాపురంలో..
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కరోనా తొలి విడత వ్యాక్సినేషన్​ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. అమలాపురంలోని ఏరియా ఆస్పత్రిలో అందిస్తున్న వ్యాక్సిన్​ సురక్షితమైనదని ఆయన వెల్లడించారు. మహమ్మారిని నిర్మూలించడానికి అందుబాటులోకి వచ్చిన టీకాను త్వరలోనే ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు.

ఎంతోమంది కృషి ఫలితంగా.. అత్యంత వేగంగా, సురక్షితమైన టీకా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

యానాంలో..

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ప్రారంభించారు. మొదటి విడతగా 300 డోసులను ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లకు మొదటి ప్రాధాన్యతగా పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి అందించనున్నట్టు స్పష్టం చేశారు.

మొదటి టీకాను ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ కాశీ సత్యనారాయణ వేయించుకున్నారు. ముందుగానే ఎంపిక చేసిన సిబ్బందిలో మొదటిరోజు 60 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా వేయించుకున్న తరువాత అరగంట పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో టీకాను దశల వారీగా అందరికీ అందిస్తామని ఆయన తెలిపారు

పి. గన్నవరంలో..

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియను శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాగులలంక, లుటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీకాను తయారీలో ఎంతోమంది విశేష కృషి చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అనతికాలంలోనే మహమ్మారిని జయించేందుకు వ్యాక్సిన్ రావడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.

అనపర్తిలో..

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. మొదటిగా అనపర్తి సామాజిక ఆరోగ్యకేంద్రంలో పని చేసే స్టాఫ్ నర్స్ మిస్సమ్మకు ఎమ్మెల్యే స్వయంగా వాక్సినేషన్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్​కు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని అనపర్తి , బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభించారు.

కొత్తపేట నియోజకవర్గంలో..

కరోనా వైరస్ నియంత్రణకు రూపొందించిన టీకాను తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం పీహెచ్​సీలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఉబలంక.. ఆలమూరు మండలం పెద్ద పెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

భార్యను రక్షించి... భర్త మరణం

ABOUT THE AUTHOR

...view details