అమలాపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గం తొలిసారిగా సమావేశమైంది. మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి.. అధ్యక్షత వహించారు. స్థానిక రెండో వార్డులో దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు పేరిట నిర్మించిన హెల్త్ ఉద్యానవనంలోని... చెరువులో గుర్రపు డెక్క లేకపోయినా తొలగించేందుకు రెండు లక్షల నలభై వేల రూపాయల మొత్తాన్ని అజెండాలో చేర్చడంపై తెదేపా కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై వాదోపవాదాలు జరిగాయి. అనంతరం అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సమస్య, ట్రాఫిక్ రద్దీ.. వంటి అంశాలను చర్చించారు. వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. మున్సిపల్ కమిషనర్ వీఏపీ నాయుడు ప్రవేశపెట్టిన అజెండాలోని వివిధ అంశాలను చర్చించి.. ఆమోదించారు.