ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - East Godavari District Latest News
21:09 July 25
గోదావరికి కొనసాగుతున్న వరద
గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రాజమహేంద్రవరం వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద నీటి మట్టం 11.8 అడుగులకు చేరడంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 10 లక్షల 11 వేల382 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద వరద నీటిని క్రమబద్ధీకరించడంతో ధవళేశ్వరానికి వరద ప్రవాహం కాస్త ఆలస్యమైంది. మరో వైపు భద్రాచలం వద్ద వరద క్రమంగా తగ్గుతోంది.
ఇదీ చదవండీ..RAMAPPA TEMPLE: కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక