తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీడీవో వెంకటేశ్వరావు మాత్రం నిబంధనలను ఉల్లంఘించారు. ఎమ్మెల్యే కుటుంబంలో 11 మందికి మొదటి డోసు వేశారు.
విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. పి.గన్నవరం తహసీల్దార్ మృత్యుంజయరావు ఈ ఘటనపై విచారణ జరిపి అమలాపురం సబ్ కలెక్టరుకు నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లా పాలనాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే చెప్పినందునే టీకాలు వేశారని తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారు.