తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 16 మండలాలు ఉండగా ఇప్పటికే 15 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రావులపాలెం మండలంలోనే ఎటువంటి కేసులు లేవు. ఇప్పుడు అక్కడ కూడా కేసు వెలుగు చూసింది. రావులపాలెం మండలం కొమర్రాజు లంకలో తొలి కేసు నమోదు అయ్యింది.
రావులపాలెం మండలంలో తొలి కరోనా కేసు నమోదు - first corona positive case registered in ravulapalem mandal
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజు లంకలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కొవిడ్ పరీక్షలో పాజిటివ్ గా నిర్థరణ అయ్యింది.
![రావులపాలెం మండలంలో తొలి కరోనా కేసు నమోదు first corona positive case registered in ravulapalem mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7740675-884-7740675-1592928986446.jpg)
రావులపాలెం మండలంలో తొలి కరోనా కేసు నమోదు
కొమర్రాజు లంకకు చెందిన ఓ వ్యక్తి వ్యాన్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయనకు గుండెలో నొప్పి వస్తోందని రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయించగా మంగళవారం మధ్యాహ్నం పాజిటివ్‌గా తేలింది. దీంతో కొమర్రాజు లంకలో ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: హోం క్వారంటైన్ ప్రజలకు నిత్యావసరాల పంపిణీ