తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. గుమ్మలేరుకు చెందిన కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం అధికారులు గుర్తించారు. మేలుజాతి ఆవుల, గేదులను పోషించే ఈ గ్రామాన్ని… ఆంధ్రా హరియాణాగా పిలుస్తారు. ఇక్కడ జైన్ దేవాలయం చాలా ప్రసిద్ధి. ఇప్పుడు ఈ గ్రామంలో కరోనా కేసు నమోదు కావడం కలవరానికి గురిచేస్తుంది.
ఆలమూరు మండలంలో తొలి కరోనా కేసు - తూర్పు గోదావరి జిల్లా తాజా వార్తలు
ఆలమూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. గుమ్మలేరుకు చెందిన ఓ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

corona case
కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప మాజీసర్పంచ్ కు పాజిటివ్ వచ్చింది. అతని డ్రైవర్ కావడంతో ఇతనికీ పరీక్షలు చేయగా… పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇతని కుటుంబ సభ్యులు, సెకండరీ కాంటాక్ట్ వారికి బుధవారం వైద్య పరీక్షలు చేయనున్నారు.