తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం బొలగొండ పంచాయతీ చెరుకూరు గ్రామంలో 5 నెలల బాలుడికి కరోనా సోకింది. మన్యంలో ఈ బాలుడితోనే తొలిగా కేసుగా నమోదయింది. ఈ నెల 20న బాలుడికి జ్వరము, దగ్గు, రొంప ఉండడంతో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానిత కేసుగా శనివారం కాకినాడ జీజీహెచ్‌కు ఆ చిన్నారిని తరలించారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏ విధంగా ఈ వ్యాధి సోకింది అనేది తెలియాల్సి ఉంది.