తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వెంకట్‌నగర్‌లో.. విద్యుదాఘాతంతో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఉదయం 7 గంటలకు ఇంటి పైభాగం నుంచి దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక.. కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని గృహోపకరణాలు, సామగ్రి, నగదు మంటల్లో బుగ్గయ్యాయి. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.