తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడులోని జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. జీడి పరిశ్రమలో మంటలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం..రూ.15 లక్షల ఆస్తి నష్టం
జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడులో జరిగింది. విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని పరిశ్రమ యాజమాని కోరారు.
జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం
సుమారు 8టన్నుల జీడి పిక్కలు, 7 క్వింటాళ్ల జీడి పప్పు, 2 క్వింటాళ్ల జీడి పప్పు నూక, డయ్యర్, కూలింగ్ మిషన్లకు చెందిన మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి రాంబాబు తెలిపారు. ప్రమాదం వల్ల భారీగా నష్టపోయానని.. తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పరిశ్రమ యాజమాని ఊటా వెంకట నారాయణరావు కోరారు.