తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దేవస్థానంలో అగ్ని నిరోధక యంత్రాలు పూర్తి స్థాయిలో లేవని, విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అగ్నిమాపక శాఖ నాలుగు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా ...అధికారులు చర్యలు చేపట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో రెండు నెలల క్రితం అగ్ని ప్రమాదం జరగ్గా, మూడురోజుల క్రితం సహాయ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదంతో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. గతంలో ఉత్సవాలు జరిగే సమయంలో పలువురు భక్తులకు విద్యుదాఘాతం జరిగింది. అగ్నిమాపక శాఖ నివేదికకు అనుగుణంగా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
అగ్నిప్రమాదాల అన్నవరం... - అన్నవరం దేవస్థానం
అన్నవరం దేవస్థానంలో భద్రత విషయంలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కొనసాగుతుంది. విద్యుదాఘాతంతో నెలల వ్యవధిలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం మర్చిపోయారు.
![అగ్నిప్రమాదాల అన్నవరం...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4334155-844-4334155-1567583016760.jpg)
fire accidents accured in ananvaram in east godavari district