తూర్పుగోదావరి జిల్లా రంగరాయ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఏసీ నుంచి మంటలు చెలరేగటంతో ప్రమాదం జరిగినట్లు ప్రిన్సిపల్ బాబ్జి తెలిపారు. విషయం తెలిసుకున్న సిబ్బంది అప్రమత్తమై.. మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన తీరును ప్రిన్సిపల్ తెలుసుకొని, వివరాలు వెల్లడించారు.
రంగరాయ కళాశాలలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం - కళాశాలలో అగ్నిప్రమాదం వార్తలు
ఏసీ నుంచి మంటలు చెలరేగటంతో తూర్పుగోదావరి జిల్లా రంగరాయ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సంఘటన జరిగినట్లు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోందని ప్రిన్సిపల్ బాబ్జి వెల్లడించారు.
రంగరాయ కళాశాలలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం