తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఏటిగట్టు దిగువునలంక భూమిలో సాగుచేసిన అరటి తోట దగ్ధమైంది. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాపు దశకు వచ్చిన నాలుగు ఎకరాల అరటి తోట ఆగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
విషాదం: నాలుగు ఎకరాల అరటి తోట దగ్ధం - east godavari district crime news
తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలోని అరటి తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు ఎకరాల తోట దగ్ధమైంది. ఊహించని ఈ పరిణామంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
నాలుగు ఎకరాల అరటి తోట దగ్ధం