ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదివాసీల చట్టాలు, హక్కుల రక్షణ కోసం పోరుబాట - తూర్పుగోదావరి జిల్లా,. మారేడిమిల్లి

తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లిలో.. ఆదివాసీ చట్టాలు అమలును డిమాండ్ చేస్తూ.. పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

east godavari district
ఆదివాసీల చట్టాలు, హక్కులపై పోరుబాట

By

Published : May 20, 2020, 7:25 AM IST

ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో.. తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి మండలం దెందులూరు గ్రామంలో పోరుబాట చేపట్టారు. ఆదివాసీ చట్టాలు, హక్కుల పరిరక్షణ, అమలుకు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3, 1/70, పీసా, అటవి హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.

సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఆదివాసీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహించారు. వాటి కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఒంటుకుల ఆదిరెడ్డి, జగ్గిరెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details