ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రంతా పక్కనే ఉంది... తెల్లవారే సరికి మాయమైంది..! - చినకొండేపూడిలో పసికందు మాయం

తల్లి పొత్తిళ్లలో అప్పటివరకు హాయిగా నిద్రిస్తున్న బిడ్డ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. రాత్రి తన పక్కనే ఉన్న బుజ్జాయి తెల్లవారేసరికి మాయమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు విచారణ జరుపుతున్నారు.

15 days baby girl is missing in east godavari
తూర్పుగోదావరిలో 15రోజుల చిన్నారి మాయం

By

Published : Jun 19, 2020, 12:37 PM IST

Updated : Jun 19, 2020, 1:56 PM IST

తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న 15 రోజుల శిశువు మాయమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. చినకొండేపూడికి చెందిన సుజాత 15 రోజుల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పుట్టింట్లోనే ఉంటోంది. సుజాత రాత్రి బిడ్డను పక్కనే పెట్టుకుని నిద్రించింది. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసే సరికి పక్కనున్న బిడ్డ మాయమైంది. కంగుతిన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై... సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. సుజాత భర్త సతీష్ కూడా అదే గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. తెలిసిన వారే బిడ్డను మాయం చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 19, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details