ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతారాముల కోసం.. కోటి తలంబ్రాల సాగు ప్రారంభించిన రైతాంగం - news on field works importance in eastgodavari

వచ్చే ఏడాది నిర్వహించే రాములోరి కల్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల తయారీకి.. సర్వం సిద్ధమైంది. తూర్పు గోదావరి జిల్లా వాసులు సాగు పనులు ప్రారంభించారు. ఇలా తొమ్మిదేళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

koti talambralu celebrations
కోటి తలంబ్రాలు కోసం ప్రారంభమైన సాగు పనులు

By

Published : Jun 16, 2020, 6:30 AM IST

వచ్చే ఏడాది నిర్వహించే రాములోరి కల్యాణానికి, గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేయాలి. వీటి తయారీ కోసం సంప్రదాయబద్ధంగా... తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో రైతులు సాగు చేస్తారు. ఆ పనులను సోమవారం నాడు ప్రారంభించారు.

రాముడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణలతో రైతన్నలు పనులకు శ్రీకారం చుట్టారు. పొలాన్ని దున్నించి, విత్తనాలు చల్లారు. రాముడి కీర్తనలను అలపిస్తూ సాగు చేపట్టారు. భద్రాచలం, ఒంటిమిట్టల్లో రాములోరి కల్యాణానికి... తొమ్మిదేళ్లుగా తలంబ్రాలను పంపిస్తున్నామని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంగం అధ్యక్షుడు కె. అప్పారావు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details