ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 11:24 PM IST

ETV Bharat / state

రంపచోడవరం, మారేడుమిల్లిలో ఫైబర్ నెట్ సేవలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించారు. సరైన సమాచార వ్యవస్థ లేకే ఏజెన్సీ ప్రాంతంలో అనారోగ్యానికి గురైన గిరిజనులు మృత్యువాత పడ్డారని ఐటీడీఏ ఇన్​ఛార్జ్ అన్నారు.

fiber net services in rampachodavaram
రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో ప్రారంభమైన ఫైబర్ నెట్ సేవలు

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో సమాచార వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తెలిపారు. రంపచోడవరం మారేడుమిల్లి మండలాలలోని 25 గ్రామాలలో ఫైబర్ నెట్ సేవలను ఐటీడీఏ ఇన్​ఛార్జి పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో సమాచార వ్యవస్థ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురైన గిరిజనులు ఎంతో మంది మృత్యువాత పడ్డారన్నారు. దీనిని అధిగమించేందుకు గూగుల్ ఎక్సై ద్వారా సెల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఫైబర్ నెట్ ద్వారా టీవీ, టెలిఫోన్, సెల్ సేవలతో పాటు అంతర్జాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details