తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఐటీడీఏ కార్యాలయంలో ఫీడర్ ఆంబులెన్స్ సారథులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అందరికీ సేవలు అందించాలని ఫీడర్ అంబులెన్స్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మోహన్ గాంధీ సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్న శిక్షణా తరగతులను అంబులెన్స్ సారథులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న సుమారు 42 మంది ఈఎంటీలకు శిక్షణ ఇచ్చారు. ఐటీడీఏ పరిధిలో మొత్తం 21 ఫీడర్ అంబులెన్స్ వెహికల్స్ వైద్య సేవలకు ఉపయోగిస్తున్నామన్నారు. సెప్టెంబర్ నాటికి 1,133 కేసులు చేర్పించామని చెప్పారు.
ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనులకు ఈ వాహనాల ద్వారా గర్భిణులు, అత్యవసర చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈఎంటీలకు శిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజుకు 4 కేసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చాలని సూచించారు. గిరిజన ప్రజలకు ఈ అంబులెన్స్ సేవల ద్వారా నిరంతరం సేవలందించేందుకు ఈఎంటీలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీలు ఎస్ క్రాంతి కుమార్, ఆనంద్, నారాయణరెడ్డి, ప్రతాప్, మనోహర్, సాగర్, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.