కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రూ.58కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. యానాంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రిని మొదలు పెట్టారు. కేంద్ర ప్రజా పనుల శాఖ పర్యవేక్షణలో పుదుచ్చేరిలోని ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయం జిప్మెర్కు అనుసంధానం చేస్తూ ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు.
వేగంగా ఆస్పత్రి భవన నిర్మాణం పనులు
తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆస్పత్రి భవన నిర్మాణం పనులు
ఆస్పత్రి నిర్మాణం పూర్తైతే ఆధునిక వైద్య పరీక్షలు, చికిత్సలు, టెలిమెడిసిన్ విధానంలోనూ రోగిని పరీక్ష చేయటం వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణ పనులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి పనుల ప్రగతిని తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:' శంకర్ విలాస్ వంతెనను పొడగించండి'