పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ మధ్యలో విడిచిపెట్టాడు. రైతులు మాత్రం చేయి చేయి కలిపి పని పూర్తి చేసుకున్నారు. నీటిని ఒడిసి పట్టుకున్నారు. తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం పాండవులు పాలెంలో చెల్లయ్యమ్మ చెరువు ఉంది. ఈ చెరువు 150 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తుంది. గత ఏడాది మాత్రం నీరు అందక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు.
అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చెరువులో నీరు నిలువ ఉంటే తమ కష్టం తీరుతుంది కదా అనుకున్నారు. వృథాను అరికట్టేందుకు ఏకమయ్యారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలని... భావించారు. చేయీ చేయీ కలిపారు. తలా వందా, వెయ్యి వసూలు చేశారు. వారి చెరువును వారే అభివృద్ధి చేసుకొన్నారు. తమ పొలాలకు నీటి సరఫరాకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసుకున్నారు. తోటీ వారికి ఆ రైతులంతా.. ఆదర్శంగా నిలిచారు.