తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కాస్త వర్షాలు తగ్గాయి. ఉదయం నుంచి ఎండగా ఉండటం వల్ల రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. తడిసిపోయిన ధాన్యం ఆరబెట్టేందుకు కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన కొద్దిపాటి పంటను కాపాడుకునే ప్రయత్నిస్తున్నారు. నేలనంటిన వరిని పైకి నిలబెడుతున్నారు. సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పూర్తిగా దెబ్బతింది. పొలాల మధ్య ఉన్న కోసిన పంటను సురక్షిత ప్రదేశానికి తరలించి ఎండ పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
తగ్గిన వర్షాలు.. ధాన్యం ఆరబెడుతున్న రైతులు - Details of paddy crop in East Godavari district
నివర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు తడిసి ముద్దయ్యాయి. ఇవాళ కాస్త వానలు తగ్గడంతో రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. కాస్తోకూస్తో మిగిలిన పంటను అయినా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ధాన్యం ఆరబెట్టే పనుల్లో రైతులు