కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో మట్టి తవ్వొద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి ఊరిచెరువులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో పలువురు రైతులు సాగు చేసుకుంటున్నారు. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ పట్టాలు ఉండగా ,మరికొన్ని భూములకు ఎటువంటి పట్టాలు లేవు. ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు సేకరించిన భూములను మెరక చేయడం కోసం ఈ చెరువులో మట్టి తవ్వేందుకు రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు.
సాగుభూమిలో మట్టి తవ్వకాలు..అడ్డుకున్న రైతులు - farmers news in east godavari dst
ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మెరక లేపేందుకు సాగు చేస్తున్న భూమిని తవ్వుతుందంటూ...తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి ఊరిచెరువులో రైతులు ఆందోళన చేశారు.పంటభూమిని తవ్వి తమకు అన్యాయం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు.
farmers protest in east godavari dst about their filed lands diggig for poor people house construction
సుమారు రెండు వందల ఎకరాల చెరువు ఉండగా కేవలం సాగుచేస్తున్న భూమిలోనే మట్టి తవ్వటంతో సంబంధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సాగు భూముల్ని మినహాయించి మిగిలిన చెరువులో మట్టి తవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండిజూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ