ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers: ధాన్యం డబ్బుల కోసం రైతుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు - east godavari district latest updates

రబీ ధాన్యం డబ్బులు చెల్లించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. సబ్​కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అమలాపురంలో రైతుల ఆందోళన
అమలాపురంలో రైతుల ఆందోళన

By

Published : Jul 15, 2021, 5:11 PM IST

రబీ ధాన్యం డబ్బులు చెల్లించాలని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతున్న రైతులను పోలీసులు ఎర్ర వంతెన దగ్గర నిలుపుదల చేసి వాహనంలో ఎక్కించారు. అక్కడ నుంచి తరలిస్తుండగా ఎస్​కేబీఆర్ కళాశాల సమీపంలో వాహనం నుంచి దూకిన రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. మళ్లీ వాహనంలో ఎక్కించుకున్న పోలీసులు.. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొత్తపేటలో రైతుల నిరసన...

ధాన్యం బకాయి సొమ్మును వెంటనే విడుదల చేయాలంటూ రైతులు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. భాజపా నాయకులు మద్దతు తెలిపారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామని ప్రభుత్వం వెంటనే ధాన్యం సొమ్ములను విడుదల చేయాలని రైతులు నినాదాలు చేశారు. ధాన్యం అమ్మి మూడు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం సొమ్ము జమ చేయకపోవడం దారుణమన్నారు.

ఇదీ చదవండి:

ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టుల భర్తీకి బ్రేక్​!

ABOUT THE AUTHOR

...view details