Farmers protest : తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో ధాన్యం రైతులు ఆందోళన చేపట్టారు. కామరాజుపేట సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. నిబంధనలతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తాజాగా గోనె సంచులు అందుబాటులో లేక రోజుల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ధాన్యం కొనాలని.. కామరాజుపేట సచివాలయానికి రైతుల తాళం - రాజమండ్రిలో రైతుల ఆందోళన
Farmers protest : ఆరుగాలం పండించిన ధాన్యం ప్రభుత్వం కోనుగోళు చేయాలేదని రైతులు ఆందోళన చేశారు. పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని స్థానిక సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. రైతులు చేసిన ఈ నిరసన ఎక్కడ జరిగిందంటే......
Farmers protest