పారాదీప్ నుండి హైదరాబాద్ వెళ్లే ఐఓసీఎల్ పైపు లైన్ పనులను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రైతులు అడ్డుకున్నారు. పొలాలను తొక్కించుకుంటూ.. పంటలను నాశనం చేస్తూ.. పనులు కొనసాగించటమేంటని అధికారులను నిలదీశారు. దీంతో రెవెన్యూ అధికారులు, ఎల్&టీ, ఐఓసీఎల్ ఉద్యోగులు రైతులతో మాట్లాడారు. ఇప్పటికే నేషనల్ హైవే, పోలవరం, పుష్కర కాలువ, విద్యుత్ లైన్లకు పెద్ద మొత్తంలో భూమిని కోల్పోయామన్నారు.
ఐఓసీఎల్ పైప్లైన్ పనులను అడ్డుకున్న రైతులు - dharmavaram latest news
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఐఓసీఎల్ పైప్లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. పైప్లైన్ వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల రేట్లు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐఓసీఎల్ పైప్లైన్
ఇప్పుడు ఐఓసీఎల్ వల్ల మరింత నష్టపోతున్నామని చెబుతున్నారు. పైప్లైన్ ప్రాజెక్టులను పోలవరం, పుష్కర కాలువల ద్వారా తీసుకెళ్తే ప్రభుత్వ ఆదాయం మిగులుతుందని రైతులు అంటున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూముల్లో నుంచి పైపు లైన్ వెళ్లటం వల్ల రేట్లు పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. నష్ట పరిహారం పెంచి.. పనులు చేసుకోవాలని అధికారులను కోరారు. ఆలోచించి తగిన చర్యలు చేపడాతామని అధికారులు అన్నారు.
ఇదీ చదవండి:అమలాపురంలో మంత్రి ధర్మాన మున్సిపల్ ఎన్నికల ప్రచారం