పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు జిరాయితీ పట్టాల భూముల్ని సైతం లాక్కునేందుకు యత్నించటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్లలో దాదాపు 10 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉందని చెబుతూ అధికారులు లాక్కునేందుకు యత్నించారు. వీటికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయని చెప్పిన రైతులు సీలింగ్ పరిధిలో భూములు ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా చేశారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. పలువురు రైతులు అదే భూమిపై రుణాలు పొందారు. భూమి లాక్కుని తమ బతుకులు నాశనం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు.
ల్యాండ్ సీలింగ్ నిబంధనతో భూములు లాక్కుంటున్నారు.. - ఏపీలో ల్యాండ్ సీలింగ్ నిబంధన వార్తలు
ల్యాండ్ సీలింగ్ నిబంధనతో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ప్రభుత్వం భూములు లాక్కుంటోంది. సీలింగ్‌లో ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగు చేసుకుంటున్న భూమి లాక్కుని పొట్టకొట్టొదని రైతులు వేడుకుంటున్నారు.
ల్యాండ్ సీలింగ్