తప్పుడు రికార్టులు సృష్టించి భూ కబ్ఝా చేయాలనుకుంటే ఊరుకోమని విశాఖ జిల్లా బూరుగుపల్లిలో రైతు సంఘం నేతలు హెచ్చరించారు. గ్రామంలో సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. బురుగుపాలు రెవెన్యూ పరిధిలో మూడు గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలవారు ఏళ్ల తరబడి జీడిమామిడి కూరగాయలు వంటివి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని... కానీ కొంతమంది భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బూరుగుపల్లిలో రైతు సంఘం నాయకుల ధర్నా - బూరుగుపల్లిలో రైతు సంఘం నాయకుల ధర్నా తాజా వార్తలు
విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపల్లిలో రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు. 50 కుటుంబాలకు చెందిన భూమిని కొంతమంది వ్యాపారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నేతలు మండిపడ్డారు.
దళారులుసహాయంతో తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాయకులు అన్నారు. వాటిని తక్షణమే విరమించాలని లేకుంటే ఉద్యమం మరింత తీవ్రస్థాయిలో ఉంటుందని నాయకులు బండి నాని బాబు, సాపిరెడ్డి నారాయణ మూర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి రెవెన్యూ పరిధిలోని మామిడిపాలెం, పోతులూరు, కంచర్లపాలెం తదితర గ్రామాలకు చెందిన సాగుదారులు, రైతు సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి. ఆదోనిలో సింపుల్గా పెళ్లి...విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!