తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన మోపూరి వెంకట రెడ్డికి 50 ఎకరాల పొలం ఉంది. నిత్యం 150 మంది వరకు కూలీలు అతని పొలంలో పని చేస్తారు. వరినాట్లు, కోతల సమయంలో వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. కరోనా కష్ట కాలంలో చాలా మంది కూలీలు పనులకు దూరమయ్యారు. ఇన్నాళ్లు తన పనులకు అండగా నిలిచిన వారు ఆకలితో అలమటించకూదని... తన పొలంలో భోజనాలు తయారు చేయించి ఇంటింటికీ తీసుకువెళ్లి మరీ ఆహారం అందిస్తున్నారు.
కూలీల ఆకలి తీరుస్తున్న అన్నదాత
లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ కూలీలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా... కరోనా సోకుతుందన్న భయంతో చాలా మంది పనులకు వెళ్లడం లేదు. ఉన్నదానితోనే సరిపెట్టుకుని జీవనం గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో వ్యవసాయ కూలీల ఆకలి తీరుస్తున్నాడో అన్నదాత.
లాక్డౌన్లోనూ కూలీలకు అండగా నిలిచని అన్నదాత
ఖర్చుకు వెనకాడకుండా రోజుకు 18 వందల మందికి 18 రోజులుగా ఆకలి తీరుస్తూ... వ్యవసాయ కూలీలపై తనకున్న మక్కువను చాటుకుంటున్నారు వెంకట రెడ్డి
ఇదీ చదవండి..రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు