ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: రైతు ప్రాణం తీసిన విద్యుత్ తీగలు - రాజోలులో కరెంట్ షాక్​తో రైతు మృతి వార్తలు

అప్పుడే ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు ఆ రైతన్న. పశువుల కోసం కొన్న దాణాను ట్రాక్టరు నుంచి దించుతున్నాడు. అప్పుడే కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు అతనికి తగిలాయి. దీంతో అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగింది.

farmer died
మృతిచెందిన రైతు తాతయ్య

By

Published : Dec 5, 2020, 7:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో విద్యుత్ తీగలు రైతు ప్రాణం తీశాయి. గ్యాస్ కంపెనీ సమీపంలోని తన పొలంలో 45 ఏళ్ల తాతయ్య ట్రాక్టర్​ పైనుంచి పశువుల దాణా దించుతున్నాడు. కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా ఆయనకు తగిలాయి. దీంతో అక్కడికక్కడే తాతయ్య ప్రాణాలు విడిచాడు.

అప్పుడే ఇంటి నుంచి పొలానికి వెళ్లిన తాతయ్య విగతజీవిగా మారటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వేలాడుతున్న తీగలు సరిచేయాలని విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని... ఇప్పుడు అవే అన్నదాత ఊపిరి తీశాయని స్థానికులు అంటున్నారు. మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details